Pages

Wednesday, June 19, 2013

Story- గందరగోళం చిందరమేళం

కృష్ణమూర్తి గారు ఆఫీసు పని మీద కొన్ని నెలలు  కర్నూలులో ఉండాల్సి వచ్చింది. భార్య పిల్లల్ని తీసుకొని వద్దమంటే స్కూల్ కి ఇబ్బంది అవుతుందని ఆయన ఒక్కరే వచ్చారు. ఆఫీసు వాళ్ళు ఆయనకు గెస్ట్ హౌసులో మకాం ఏర్పాటు చేసారు. ఆయనకు పనులు చేసి పెట్టడానికి ఒక పని వాడిని కూడా పెట్టారు. వాడి పేరు మాలోకం. పేరుకు తగ్గట్టు ఒట్టి తింగరి మేళం. అన్ని పనులు హడావిడిగా చేసేసి ఒక దానికి ఒకటి చేసి పెడతాడు. చెప్పేది పూర్తిగా వినకుండానే వెళ్లి పోయి వాడికి తోచినట్టు చేసేవాడు.కృష్ణమూర్తి గారికి వాడి పనులతో చిరాకు వచ్చేసేది. పనిలోంచి తీసేద్దామంటే  పాపం అమాయకుడు ఎవరు పనిలో పెట్టుకోకపోతే ఇబ్బందుల్లో పడతాడు అని ఆయనే సర్దుకు పోయేవాడు. ఆయనకు కర్నూల్ రాకముందు రక్తపోటు సమస్య లేదు. కానీ వాడి పుణ్యమా అని అక్కడికి వచ్చాక మొదలయ్యింది.

ఒక ఆది వారం అర్జెంటు గా ఆఫీసు కి రమ్మని ఫోన్ వచ్చింది. కృష్ణమూర్తి గారు మాలోకంని పిలిచి " నేను అర్జెంటు గ ఆఫీసు కి వెళ్ళాలి ఫై ఆఫీసర్ వచ్చాడంట .నేను తొందరగా స్నానం చేసి వస్తాను ఈ లోపల నువ్వు షూస్ పోలిష్ చేసి , బ్రెడ్ కి జాం పూసి ఉంచు. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నా స్నేహితుడు ఒకడు ఈ రోజు మనింటికి భోజనానికి వస్తున్నాడు నేనేమో అనుకోకుండా బయటికి వెళ్ళాల్సి వస్తోంది . ఎప్పటికి వస్తానో ఏమో. అతనికి ఫోన్ చేద్దామంటే అతని దగ్గర సెల్ ఫోన్ లేదు. సరే లే అతనిని భోజనం చెయ్యమని చెప్పు. మొహమాట పడతాడేమో నేను చెప్పానని చెప్పి బలవంతంగా తినిపించు. నిన్న రాత్రి వంట మిగిలింది కదా అని వండకుండా అవే పెడతావేమో అది బిచ్చగాడికి ఇచ్చేసి మల్లి ఫ్రెష్ గా వండు. అర్ధమయ్యిందా?"  అని చెప్పి ఆయన హడావిడిగా స్నానం చేసి వచ్చాడు. ఆకలి దంచేస్తుంది.టై  కట్టుకుంటూ బ్రెడ్ ముక్క కొంచం కొరికాడు,అంతే ఎవరో చెయ్యి పెట్టి ప్రేగుల్లన్ని  తిప్పినట్టు అనిపించింది ఉమ్మేసాడు. చూస్తె  బ్రెడ్ కి shoe పోలిష్ పూసి ఉంది. అనుమానం వచ్చి కిందకి చుస్తే షూస్ కి జామ్ పూసి వుంది. ఆయనకి కోపం నషాళానికి ఎక్కింది. వాడిని చెడామడ తిట్టి చెప్పిన మిగితా పనులన్న సరిగ్గా చెయ్యమని చెప్పి వేరే షూస్ వేసుకొని ఆపిల్ తింటూ వెళ్ళిపోయారు. "ఏంటో ఈ సారుకి మరి కోపం ఎక్కువ. ఇప్పుడు చూడు మిగిలిన పనులు ఎంత బాగా చేస్తానో.దెబ్బకి సర్ అంత మర్చిపోయి నాకు కాజు బర్ఫీ తెస్తారు" అని వాడిలో వాడు అనుకోని పనులు మొదలు పెట్టాడు మాలోకం.

ఒక రెండు గంటల తర్వాత  కృష్ణమూర్తిగారు ఇంటికి వచ్చారు. నా స్నేహితుడు ఏడి అని అడిగితే " భోజనం చేసి ఇప్పుడే వస్తాను అని వెళ్లిపోయారండి. అయిన అయ్యగారు ఆయనేంటండి ఎన్నో రోజులుగా తిండి తిననట్టు అల ఆబగా తినేసారు. పాపం చాలా బీద వారిలా ఉంది చొక్కా చినిగిపోతే మీది పాత చొక్కా ఇచ్చానండి " అన్నాడు మాలోకం. శేషగిరి  గారికి ఒక్క ముక్క అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని మిత్రునికి ఫోన్ చేస్తే ,అతను నీ ఇంటికి పిలిచి నువ్వు చేసే మర్యాద ఇదేనా అని చెడామడ తిట్టేసాడు. కృష్ణమూర్తిగారికి మెల్లగా విషయం అర్ధం అయ్యింది. ఎలాగో మిత్రునికి సర్ది చెప్పాడు. జరిగిందేంటంటే మాలోకం బిచ్చ గాడిని ఇంట్లోకి పిలిచి విందు భోజనం పెట్టి, కృష్ణమూర్తి గారి స్నేహితునికి ముందు రోజు అన్నం తెచ్చి పడేసాడు. జరిగింది తలచుకుంటే కృష్ణమూర్తిగారికి BP పెరిగి పోయింది. పోనీ ఉద్యోగంలోంచి తేసేద్ధామంటే పాపం ఎవరు పనిలో పెట్టుకోకపోతే ఎలా బ్రతుకుతాడు అని జాలి. ఏమి చెయ్యాలో తెలియక జుట్టు పీక్కున్నారు. పాపం ఆయనకు ఇక్కడికి వచ్చాక బట్ట తల రావడం కూడా మొదలయ్యింది. పోనీ భార్యని రమ్మని చెప్దామంటే ఆమెకు పిల్లలు,వేరే భాధ్యతలు  ఉన్నాయి అక్కడ.ఏమి చెయ్యాలి.  వీడి కంగారే వీడి పెద్ద సమస్య .నిదానంగా చెప్పింది పూర్తిగా విని మనసు పెట్టి చేస్తే ఆని సక్రమంగా చేస్తాడు. ముందు వీడి స్పీడ్ తగ్గించాలి అంటే ఏదైనా స్పీడ్ బ్రేకేర్ పెట్టాలి.అంటే ఏదో ఒక ఆశ చూపాలి. డబ్బాశ చూపిస్తే క్రమంగా తను బికారి అయిపోతాడు. అప్పుడు ఆయనకీ వాడి తిండి పిచ్చి గుర్తొచ్చింది. వాడు ఎప్పుడో  తనకు పుల్లా రెడ్డి స్వీట్స్ అంటే ప్రాణమని చెప్పినట్టు గుర్తు. వెంటనే షాప్ కి వెళ్లి 1 కేజీ స్వీట్స్ తెచ్చారు. వాడిని పిలిచి ఈ డబ్బా నీకే అన్నారు. వాడికి భలే ఆనందం వేసింది . "కానీ నీకు ఇవ్వాలంటే ఒక షరతు .ఈ డబ్బా నా దగ్గరే ఉంటుంది . నేను చెప్పిన పనులు సరిగ్గా చేసవనుకో, చేసిన ప్రతి పనికి ఒక స్వీట్ ఇస్తాను. తప్పు చేసవనుకో నీ ముందే నేను ఒక స్వీట్ తింటాను." అని చెప్పారు. వాడికి స్వీట్స్ చూస్తుంటే నోట్లో నీల్లూరుతున్నాయి. ఆ రోజు నుండి వాడికి ప్రతి పని చేసే ముందు ఆ స్వీట్ డబ్బా గుర్తు వచ్చేది. అన్ని పనులు శ్రద్ధగా చెయ్యడం మొదలుపేట్టాడు.  చేసిన వెంటనే వచ్చి కృష్ణమూర్తిగారి ముందు చెయ్యి చాచి నిలబడేవాడు.ఆయన స్వీటు ఇచ్చి పని బాగా చేసినందుకు బాగా పొగిడేవారు.  ఆయన అలా మెచ్చుకోవడం వాడికి చాల నచ్చింది. క్రమంగా వాడికి హడావిడి తగ్గింది. స్వీట్ కంటే అయ్యగారి పొగడ్తలే తియ్యగా అనిపించడం మొదలయ్యింది. లంచం(స్వీట్)  అవసరం లేకుండానే పనులు చేసేవాడు.కృష్ణమూర్తిగారికి ఇప్పుడు  సుఖంగా ఉంది.  వాడికి ఇంకొక కేజీ స్వీట్స్ తో పాటు వాడికి జీతం కూడా పెంచారు.


(ఏదో సరదాగా వ్రాసిన కధ. అందరికి నచ్చుతుందని ఆశిస్తు...)

No comments:

Post a Comment

To leave a comment please touch the rectangle next to "comment as" and you can pick options like if you want to use your google id or wordpress login etc. to comment. You also have the option to just use your name and be anonymous to leave a comment.